చెన్నైని ఆదుకోవడానికి మనస్టార్స్ ఎంతో సహాయం అందిస్తున్నారు. అన్నివిధాలుగా ఆదుకునేందుకు నడుం బిగించారు. వీళ్లందరి మధ్య సిద్దార్ద్ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఏదో డబ్బుల రూపంలో విరాళం ప్రకటించి వదిలేయకుండా చెన్నై వాసులను ఆదుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగాడు. ట్విట్టర్‌లో తనని ఫాలో అవుతున్న వారితో ఓ నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడు. వాళ్ల సహాయంతో ఆహారపొట్లాలు, మంచి నీటి ప్యాకెట్లు సేకరించి, చెన్నైలో వీధి వీధి తిరుగుతూ పంచిపెడుతున్నాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లని సరిగ్గా వాడుకొంటే.... ఎన్ని మంచి పనులు చేయవచ్చో నిరూపిస్తున్నాడు. ట్విట్టర్‌లో సిద్దార్థ్ పిలుపునకు వేలాదిగా యువతరం స్పందిస్తోంది. సిద్దూ చేస్తున్న ఈ మంచి పనికి అందరూ చలించిపోతున్నారు. రియల్‌హీరో అంటూ కితాబులు ఇస్తున్నారు. సిద్దు.. నువ్వు సూపరోయ్...!