మాటలు నేర్చిన చిలుక ఉస్కో... అంటే... డిస్కో అందనే సామెత చందంగా ఉంది హీరోయిన్ కాజల్ అగర్వాల్ పరిస్థితి. రెమ్యూనరేషన్ నచ్చకపోతే అడుగు కూడా ముందుకు వేయని ఈ చందమామ ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ నామజపం చేస్తోంది. ఇండస్ట్రీలో ఎలా నెగ్గుకురావాలో బాగా నేర్చుకున్న ఈ చిన్నది తాజాగా పవన్ నటిస్తున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు పవన్‌కళ్యాణ్ వంటి గొప్ప వ్యక్తిని ఇప్పటివరకు తన జీవితంలో చూడలేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఏ హీరోతో అవకాశం వస్తే వారిని భజన చేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య.గతంలో ఈమె విజయ్, మహేష్‌బాబు, సూర్య, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి నటించేటప్పుడు కూడా వాళ్లను తన పొగడ్తలతో మునగచెట్టు కాదు.. ఏకంగా ఎవరెస్ట్ శిఖరాన్నే ఎక్కించింది. ప్రస్తుతం పవన్ నామకోటి రాస్తూ ఓం పవనాయనమ: అంటోన్న ఈ అమ్మడు గతంలో రెమ్యూనరేషన్ తక్కువ అని ఆల్‌రెడీ పవన్‌తో వచ్చిన అవకాశాన్ని వదిలేసిన విషయాన్ని విమర్శకులు గుర్తు చేస్తున్నారు.