Advertisementt

హీరోగా మరో కమెడియన్‌..!

Thu 10th Dec 2015 01:03 PM
satyam movie,satyam rajesh,trisha,nayaki movie,horror comedy jonar  హీరోగా మరో కమెడియన్‌..!
హీరోగా మరో కమెడియన్‌..!
Advertisement
Ads by CJ

కమెడియన్లు హీరోలుగా మారడం కామన్‌ అయిపోయింది. గతంలో అలీ, బ్రహ్మానందం, బాబూమోహన్‌, వేణుమాధవ్‌, సునీల్‌... ఇలా ఎందరో కమెడియన్లు హీరోలుగా నటించారు.. నటిస్తున్నారు. తెలుగు కమెడియన్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆమధ్య వచ్చిన 'గీతాంజలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే బాటలో మరో కమెడియన్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'సత్యం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని 'సత్యం' పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొన్న సత్యంరాజేష్‌ త్వరలో త్రిష ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'నాయకి' చిత్రం ద్వారా ఆయన ఎంట్రీ ఇస్తున్నాడు. గోవర్ధన్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో వన్‌ ఆఫ్‌ది లీడ్‌ రోల్‌ చేస్తున్నాడు రాజేష్‌. ఇదో హర్రర్‌ కామెడీ చిత్రం. రాజేష్‌ సరసన సుష్మారాజ్‌ నటిస్తుండగా త్రిష సరసన వెంకట్రామన్‌ నటిస్తున్నాడు. 1980 నాటి కథతో, హత్యకు గురై దెయ్యంగా మారిన ఓ మహిళ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈచిత్రం జనవరి చివరివారంలో విడుదలకు సిద్దమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ