'బ్రూస్ లీ' సినిమా రిజల్ట్ తో రామ్ చరణ్ చేయాలనుకున్న 'తని ఒరువన్' రీమేక్ చిత్రాన్ని పక్కన పెట్టేసి ఓ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో పడ్డాడనే వార్తలు వినిపించాయి. దీనికోసం చరణ్ కథలు కూడా విన్నాడట. అయితే చరణ్ మాత్రం తను చేయబోయే తదుపరి చిత్రాల విషయంలో చాలా ప్లానింగ్ తో ఉన్నాడు. ముందుగా తను అనుకున్నట్లు కొత్త సంవత్సరంలో 'తని ఒరువన్' చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఆ తరువాత గౌతమ్ మీనన్ చెప్పిన కథను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. దానికి సంబంధిన స్క్రిప్ట్ వర్క్ కూడా గౌతమ్ మొదలు పెట్టేసాడట. దాని వెంటనే పవన్ కళ్యాణ్ నిర్మాతగా రామ్ చరణ్ సినిమా ఉంటుంది. ఆ తరువాత రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇలా వరుస చిత్రాలతో కొత్త సంవత్సరమంతా.. ప్రేక్షకులను అలరించనున్నాడు..!