Advertisementt

ఆశలు వదులుకున్న రెజీనా..!

Fri 11th Dec 2015 04:50 PM
rejeena,power movie,raviteja,majnu,nagachaitanya,premam remake  ఆశలు వదులుకున్న రెజీనా..!
ఆశలు వదులుకున్న రెజీనా..!
Advertisement
Ads by CJ

రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు అటుఇటుగా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌ రెజీనా. అందం, అభినయం, కావాల్సివస్తే లిప్‌లాక్‌... ఇలాదేనికైనా ఓకే అనే రెజీనాకు అన్ని ఉన్నా అదృష్టం మాత్రం దూరంగా ఉండిపోయింది. స్టార్‌ హీరోలు ఆమెను పట్టించుకోవడం లేదు. 'పవర్‌' సినిమాలో రవితేజ సరసన సెకండ్‌హీరోయిన్‌గా నటించిన తర్వాత అయినా ఆమెకు స్టార్స్‌ అవకాశం ఇస్తారని ఎదురుచూసింది. కానీ ఆ కల నిజం కాలేదు. దాంతో ఆమె స్టార్‌హీరోలను పక్కనపెట్టి కేవలం మీడియం హీరోలతో సర్దుకుపోతోంది. తాజాగా ఆమె నాగచైతన్య హీరోగా నటిస్తున్న మలయాళ 'ప్రేమమ్‌' రీమేక్‌ 'మజ్ను'లో మూడవ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని సంపాదించిందని సమాచారం. ఇక ఆమె మరో చిత్రంలో రానా సరసన హీరోయిన్‌గా 
నటించడానికి ఓకే చెప్పిందట. స్టార్‌హీరోల నుండి పిలుపు రాకపోవడంతో ఆమె గోపీచంద్‌, సాయిధరమ్‌తేజ్‌, మనోజ్‌ వంటి వారికే పరిమితం అవుతోంది. మొత్తానికి ఎవరైతే ఏమి? వరుస అవకాశాలు చేతిలో ఉంటే చాలని ఆమె భావిస్తోందిట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ