Advertisementt

కొత్త సంవత్సరం ఎవరి బోణీ కలిసి రానుంది..!

Sat 12th Dec 2015 12:26 PM
nenu sailaja,lacchimdeviki o lekkundi,vennello hai hai movies,janavari 1st release  కొత్త సంవత్సరం ఎవరి బోణీ కలిసి రానుంది..!
కొత్త సంవత్సరం ఎవరి బోణీ కలిసి రానుంది..!
Advertisement
Ads by CJ

గత రెండు మూడేళ్లుగా శ్రీకాంత్‌ తరహా హీరోల చిత్రాలతో నూతన సంవత్సరం ప్రారంభం అవుతూ వస్తోంది. కాగా వచ్చే ఏడాది మొదటిరోజైన జనవరి 1న ఈసారి మూడు సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. కిషోర్‌ తిరుమలశెట్టి దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా, రామ్‌ హీరోగా నటిస్తున్న 'నేను... శైలజ' చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇక అదే రోజున సీనియర్‌ దర్శకుడు వంశీ దర్శకత్వం వహిస్తున్న 25వ చిత్రం 'వెన్నెల్లో హాయ్‌..హాయ్‌' చిత్రం విడుదల కానుంది. ఇందులో అజ్మల్‌, నిఖితా నారాయణ్‌ జంటగా నటిస్తున్నారు. ఎంతో కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని నూతన ఏడాది మొదటి రోజున విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. వీటితో పాటు నవీన్‌చంద్ర, లావణ్యత్రిపాఠి జంటగా జగదీశ్‌ తలశిల దర్శకత్వంలో రూపొందుతున్న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' చిత్రం కూడా అదే రోజున విడుదలకానుంది. ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. మరి ఈ మూడు చిత్రాలలో ఏవి కొత్త ఏడాదికి శుభారంభం పలుకుతాయో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ