Advertisementt

ఫ్యాన్స్‌కు పవన్‌ న్యూఇయర్‌ కానుక..!

Sat 12th Dec 2015 09:54 PM
pawan kalyan,sardaar gabbar singh,new year gift,sardaar gabbar singh new teaser,bobby  ఫ్యాన్స్‌కు పవన్‌ న్యూఇయర్‌ కానుక..!
ఫ్యాన్స్‌కు పవన్‌ న్యూఇయర్‌ కానుక..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ హీరోగా బాబి దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా, రాయ్‌లక్ష్మీ కీలకమైన పాత్రతో పాటు ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. బెంగుళూర్‌ బ్యూటీ సంజన కూడా ఈ చిత్రంలో తళుక్కున మెరవనుంది.  ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డే కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చిన సంగతి విదితమే. కాగా నూతన ఏడాది ప్రారంభం రోజున అంటే డిసెంబర్‌ 31 వ తేదీ అర్ధరాత్రి 12గంటలకు ఈ చిత్రం న్యూ టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి కొత్త ఏడాదికి పవన్‌ 'సర్దార్‌' టీజర్‌ ద్వారా రావడం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ