Advertisementt

గొడవలొద్దు, నేనే అవుట్

Sun 13th Dec 2015 04:03 PM
nannaku prematho,junior ntr,sukumar  గొడవలొద్దు, నేనే అవుట్
గొడవలొద్దు, నేనే అవుట్
Advertisement
Ads by CJ

సంక్రాంతికి ఊరంతా ఒక పండగయితే, సినిమా పిచ్చోల్లకి థియేటర్లలో మాత్రమే ఈ పండగ వాతావరణం నెలకొంటుంది. అందుకే అచ్చొచ్చిన సీజన్లో కేవలం పెద్ద పెద్ద హీరోల, భారీ బడ్జెట్ సినిమాలకే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొని ఉంటుంది. రాబోయే సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ దగ్గర ఎక్కడలేని హడావిడి కనపడబోతుంది. ముందుగా నందమూరి హీరోల మధ్య తగువు తప్పదని, బాలకృష్ణ డిక్టేటర్ అండ్ తారక్ నాన్నకు ప్రేమతోల మధ్యే అసలు సిసలైన యుద్ధం అనుకున్న సమయంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన ఆశ్చర్యకరమైన ఎంట్రీ ఇచ్చింది. వీటికి తోడు ఎక్స్ ప్రెస్ రాజా, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు కూడా అప్పుడే దిగే చాన్సులు లేకపోలేదు. బాబాయితో ఎందుకు కుస్తీ అని దగ్గరి వారు హితబోధ చేయడంతో అబ్బాయి ఎన్టీయార్ కొంచెం తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుత షెడ్యూలును మరింత తాపీగా పూర్తి చేసుకుని స్పెయిన్ నుండి ఇండియాకి తిరుగు ప్రయాణం కట్టనున్నారట. సుకుమార్ కోరిక మేరకు హేబా పటేల్ అక్కడికి పయనం అయిందంటే మరికొన్ని సీన్లు, ఒక పాట తీసుకొని నెలాఖరుకి గానీ రారేమో అన్న వార్త కూడా ఫిలిం నగర్లో షికార్లు కొడుతోంది. తారక్ గనక నిజంగానే పోటీ నుండి తప్పుకొంటే ఇది బ్రేకింగ్ అండ్ షేకింగ్ న్యూస్ అవుతుంది. కానీ హేబాను స్పెయిన్ తరలించిన తీరు చూస్తుంటే నాన్నకు ప్రేమతో నెమ్మదించింది అనే చెప్పుకోవాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ