Advertisementt

అబ్బ... సమంతా ఎంత మంచిదో!

Sun 13th Dec 2015 04:09 PM
samantha,30 lakhs,chennai floods  అబ్బ... సమంతా ఎంత మంచిదో!
అబ్బ... సమంతా ఎంత మంచిదో!
Advertisement
Ads by CJ

 

ఎంత సంపాదించినా, సాటివారికి సాయం చేయాలి, తన అనుకున్న తోటివారిని అవసరంలో ఆదుకోవాలి అన్న  గుణం ఉండడం నిజంగా గొప్పతనం. ఈ విషయంలో స్టార్ హీరోయిన్ సమంత తనలో ఎంతటి దాతృత్వం దాగి ఉందో మరోసారి చాటుకుంది. మానవత్వానికి కరిగిపోయే మనసున్న కొద్ది మంది హీరోయిన్లలో సమంతా ఎప్పుడు ముందుంటుంది. ఇటీవల చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తడంతో, ప్రజల జీవనం అతలాకుతలమైంది. సిని పరిశ్రమ నుండి ఎనలేని విరాళాలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు సమంతా ఇచ్చిన 30 లక్షలు కూడా భారీ విరాళంగానే పరిగణించాలి. ఇప్పుడే కాదు, గతంలో కూడా సమంత ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసింది. అందుకే అందరిలోను సమాజ సేవలో సమంతాను ఆదర్శంగా తీసుకునేవారు ఎక్కువగా ఆమెను అభిమానిస్తుంటారు. 30 లక్షలు నిజంగా ఆమె నుండి ఎవరూ ఊహించి ఉండరు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ