Advertisementt

అనూప్‌ హవా మళ్లీ రాబోతుంది!

Sun 13th Dec 2015 05:57 PM
anup rubens,soukyam,soggade chinni nayana,gopala gopala,temper,anup rubens music director movies  అనూప్‌ హవా మళ్లీ రాబోతుంది!
అనూప్‌ హవా మళ్లీ రాబోతుంది!
Advertisement
Ads by CJ

తన చిన్నపాటి కెరీర్‌లో ఎత్తుపల్లాలను ఎన్నో చూసిన సంగీత సంచలనం అనూప్‌రూబెన్స్‌. ఒక సినిమాలో ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో.. అనూప్‌ కెరీర్‌లో కూడా అన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. వరసగా నితిన్‌ చిత్రాలను మ్యూజికల్‌ హిట్స్‌ చేసిన ఆయనకు ఆ వెంటనే 'గోపాల గోపాల, టెంపర్‌' వంటి స్టార్స్‌ చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. తాజాగా వచ్చిన 'అఖిల్‌' చిత్రానికి ఆయన కూడా పనిచేసినప్పటికీ ఆయనకు ఎలాంటి పేరును ఈ చిత్రం సాదించిపెట్టలేకపోయింది. ఒక్కోసారి యమస్పీడ్‌గా ఉండే ఈయన మరికొన్ని రోజులు అసలు ఊసే లేకుండా పోతుంటాడు. ఇలా వరుస చిత్రాలతో బిజీగా, మరోసారి ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం ఆయన కెరీర్‌లో సాదారణమై పోయింది. కాగా ఆయన త్వరలో మరోసారి తన సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెలలో ఆయన సంగీతం అందించిన రెండు చిత్రాల ఆడియోలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈరోజు(DEC 13) ఒంగోలులో ఆయన సంగీతం అందించిన గోపీచంద్‌ 'సౌఖ్యం' విడుదల కానుంది. ఈ నెలాఖరులో ఆయన నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తోన్న 'సోగ్గాడే చిన్ని నాయన' ఆడియో కూడా విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ రెండు చిత్రాలైనా మరలా అనూప్‌కు మంచి అవకాశాలను వచ్చేలా చేస్తాయో లేదో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ