మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. పవన్‌కల్యాణ్ రిజెక్ట్ చేసిన చిత్రాలు, మరీ ముఖ్యంగా పవన్ వదిలేసిన తర్వాత రవితేజ తో రీప్లేస్ చేసిన చిత్రాలు ఖచ్చితంగా హిట్ అవుతాయనే సెంటిమెంట్‌ను 'బెంగాల్‌టైగర్'తో మరోసారి నిరూపితం అయింది. ఫ్లాప్‌లలో ఉన్న రవితేజకు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంపత్‌నందికి 'బెంగాల్‌టైగర్' కలిసొచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన మెగాభిమానులు మాత్రం అంత ఎంటర్‌టైనింగ్ స్టోరీని పవన్ ఎందుకు వదిలేశాడా? అని బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ కథను కొన్ని మార్పులతో రవితేజ బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా సంపత్‌నంది మలిచాడట. అదే పవన్‌తో చేయాలని భావించినప్పుడు పర్‌ఫెక్ట్‌గా పవన్‌కు సూటయ్యే విధంగానే ఈ కథను రాసుకున్నాడని, అదే ఈ చిత్రాన్ని పవన్ చేసి ఉంటే ఆ రేంజ్ ఆకాశాన్ని తాకివుండేదని అంటున్నారు. మొత్తానికి తాను పడ్డ కష్టానికి తగిన ఫలితం దొరికినందుకు సంపత్‌నంది కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాడు.