పూరీజగన్నాధ్‌కు ఇప్పుడు అర్జంట్‌గా ఓ మాసీ హిట్ కావాలి. 'టెంపర్' దాదాపు అది అందించింది. కానీ.. ఎందుకనో అది పూరీకి సరిపోలేదు. ఆ తర్వాత వచ్చిన 'జ్యోతిలక్ష్మీ' కూడా బాగా నిరాశపరచడంతో పూరీ కెరీర్ డౌన్‌ఫాల్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు 'లోఫర్' చిత్రంపై ఆయన ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాడు. మెగాహీరో వరుణ్‌తేజ్ తొలిసారి మాస్ పాత్ర పోషించాడు. ట్రైలర్లు అంతగా ఆసక్తిని కలిగించకపోయినా, పాటలు పేలకపోయినా ఈసినిమాకి ల్యాబ్ నుండే కాదు..సెన్సార్ బోర్డ్ నుండి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని ప్రశంసించారట. ఇక ఇండస్ట్రీలో, ల్యాబ్ రిపోర్ట్ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ వచ్చింది. 'లోఫర్' మాస్‌కి బాగా ఎక్కేస్తుందని, ఈ సినిమాలో విషయం ఉందని, పూరీ గత చిత్రాల కంటే చాలా బెటర్ అని చెబుతున్నారంతా. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో మదర్ సెంటిమెంట్‌కి సంబంధించిన సన్నివేశాలు బాగా పండాయట. దానికితోడు ఫైట్స్ కంపోజిషన్ కూడా అదిరిపోయందని చెబుతున్నారు. ఇదే నిజమైతే... అటు వరుణ్‌తేజ్‌కు, ఇటు పూరీకి 'లోఫర్' మంచి బ్రేక్ అవుతుందని అంటున్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్దమవుతోంది.