డిక్టేటర్ రిలీజు ప్రణాళికను స్వయంగా డిజైన్ చేస్తున్న బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి తమదే ఎదురులేని చిత్రంగా నిలపడానికి అస్త్రశస్త్రాలను వినియోగించనున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీయార్, సుకుమార్లతో చర్చలు జరపమని, ఎలాగైనా నాన్నకు ప్రేమతోని పోటీ నుండి తప్పించేందుకు రంగం సిద్ధం చేసేసారు. ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాల వేగం చూస్తుంటే సంక్రాంతికి కాదు కదా ఫిబ్రవరి వరకు కూడా సిధ్ధమవదు అనిపిస్తోంది. ఇక నిన్న రిలీజ్ చేసిన నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన ట్రైలర్లో సైతం ఎక్కడా సంక్రాంతికి రానుందని చెప్పకపోవడం ఓ మెలిక. బయటివారే ఈ చిత్రాన్ని పొంగల్ పోటీలో పెట్టారు తప్ప దర్శకుడు కళ్యాణ్ కృష్ణగానీ, హీరో అండ్ నిర్మాత నాగార్జునగానీ అఫీశియలుగా చెప్పలేదు. బాలయ్యకు అక్కినేని వారితో ఉన్న రిలేషన్ దృష్ట్యా దీన్ని వాయిదా వేయించడం పెద్ద సమస్య కాబోదు. ఇక మిగిలిన ఎక్స్ ప్రెస్ రాజాలు, సీతమ్మ అందాలు లాంటివి బాలయ్య ముందు తేలిపోతాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగి తారక్, నాగార్జున గనక కాంపిటీషన్ నుండి తప్పుకుంటే బాక్సాఫీస్ దగ్గర డిక్టేటర్ రచ్చ రంబోలా చేయడం పక్కా...