సుధీర్‌బాబుకు హీరోగా కంటే ప్రిన్స్ మహేష్‌బాబు బావగానే గుర్తింపు ఎక్కువ అని చెప్పాలి. సుధీర్‌బాబుకు తొలి నుంచి బావ మహేష్ సపోర్ట్ చాలా వుంది. అయితే ఆ మధ్యలో ఎందుకో సుధీర్ గురించి మహేష్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ బావను సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు మహేష్. అందుకే గతంలో ఆయన నటించిన కొన్ని చిత్రాల ఆడియోకు హాజరుకాలేకపోయినా.. ఇప్పుడు సుధీర్ అన్ని చిత్రాల ఆడియోలకు తప్పనిసరిగా హాజరుకావాలని.. బావ కళ్లలో ఆనందం చూడాలని ఫిక్సయిపోయాడు. ఇటీవల జరిగిన ‘భలే మంచిరోజు’ ఆడియోలో ఓ హిట్ పడితే సుధీర్ సూపర్‌స్టార్ అవుతాడని కూడా పొగిడి మహేష్ బావను సంతృప్తిపరిచాడు. అంతేకాదు ఇప్పుడు కొన్ని కమర్షియల్ యాడ్స్‌కు కూడా సుధీర్ పేరును రికమండ్ చేస్తున్నాడు. అందులో భాగంగానే హాల్స్ వాణిజ్యప్రకటనలో నటించే ఛాన్స్ సుధీర్‌కు వచ్చేలా చేశాడు మహేష్. సో. ఇదంతా చూస్తుంటే బావపై నమ్మకం కుదిరి.. ఆయనను స్టార్‌హీరో చేయాలనే కంకణం మహేష్ కట్టుకున్నాడని అనిపిస్తుంది..!