Advertisementt

వారం ముందే పండగ వచ్చేస్తోంది!

Wed 16th Dec 2015 06:15 PM
bajirao mastani,dilwale,chrsitmas celebrations  వారం ముందే పండగ వచ్చేస్తోంది!
వారం ముందే పండగ వచ్చేస్తోంది!
Advertisement
Ads by CJ

పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పే ముందు క్రిస్మస్ పండగని, అప్పుడు వచ్చే సెలవులని అందరూ ఉల్లాసంగా గడుపుతారు. అందుకే ఈ సీజన్లో బడా బడా హిందీ సినిమాలు బరిలో పోటీకి నిలిచి పండగ వాతావరణాన్ని తలపిస్తాయి. కానీ ఈసారి మాత్రం ఈ ఫెస్టివల్ ఓ వారం రోజుల ముందే సందడి చేయనుంది. డిసెంబర్ 25న అసలు క్రిస్మస్ అయితే వారం ముందు అంటే డిసెంబర్ 18న రిలీజవబోయే బాజీరావు మస్తానీ, దిల్ వాలే చిత్రాల విడుదలతో బాలివుడ్ వేడి ఎక్కబోతోంది. ఈ రెండు చిత్రాల మీద బిజినెస్ వెయ్యి కోట్ల వరకు వెళ్ళవచ్చు అన్నది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. దిల్ వాలేలో షారుఖ్ ఖాన్, కాజోల్ అండ్ రోహిత్ శెట్టి; బాజీ రావు మస్తానీలో రన్వీర్ సింగ్, దీపిక పదుకొనె, ప్రియాంకా చోప్రా అండ్ సంజయ్ లీలా భన్సాలీలు. ఇవి మామూలుగా అమ్ముడుపోయే బ్రాండ్స్  కాదు. తెలుగు వారికి సంక్రాంతి సీజన్ సేల్స్ పరంగా మంచి టైం అయితే బాలివుడ్ వాళ్లకు మాత్రం డిసెంబర్ క్రిస్మస్ సెలవులు హాట్ కేకులు. అందుకే కొద్ది మంది తెలుగు సినిమా పిచ్చోళ్ళు కూడా లోఫర్ కాదని, షారుఖ్-కాజోల్; దీపిక-రన్వీర్ కోసం వేచి చూస్తున్నారు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ