'డిక్టేటర్' ఆడియో వేడుకని అమరావతిలో జరపాలని బాలయ్య ముందే నిర్ణయించుకున్నాడు. ఈనెల 20న ముహూర్తం ఫిక్సయినా.. నెల రోజుల ముందు నుంచే అందుకు తీవ్రమైన ఏర్పాటు జరుగుతున్నాయి. వేదికను సెలక్ట్ చేయడం, అతిధుల జాబితా తయారు చేయడం .. ఇవన్నీ బాలయ్యే స్వయంగా చూసుకుంటున్నాడు. ఈ ఫంక్షన్‌కి కనీసం లక్ష మంది అభిమానులను తీసుకురావాలన్నది బాలయ్య ఆలోచన. అందుకే అమరావతి చుట్టుపక్కల ఉన్న నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్‌కి భారీ ఎత్తున పాస్‌లు పంపిణీ చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్‌ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలు, రాయలసీమ జిల్లాల నుండి అమరావతికి బస్సులు వేస్తున్నారు. 20వ తేదీ మధ్యాహ్నం అమరావతి వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించాలని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య బలం, బలగం ఏమిటో 'డిక్టేటర్' ఆడియో ఫంక్షన్ ద్వారా చూపించాలని అభిమానులతో పాటు బాలయ్య కూడా కోరుకుంటున్నాడు. పాటలెలా ఉన్నాయో? ట్రైలర్ సంగతేంటి? అనే వాటికంటే ఎంతమందొచ్చారు? ఎంత హంగామా చేశారు? అనే దానిపైనే దృష్టి వెళ్లిపోతుందేమో....!