చాలారోజుల తర్వాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తనలో దాగున్న పూర్తి స్థాయి క్రియేటర్‌ను బయటకు తీస్తున్నాడు. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో సొంతగా పాటలు పాడాడు. 'బద్రి, తమ్ముడు, జానీ, ఖుషీ, డాడీ' వంటి చిత్రాలకు స్టంట్స్ మాస్టర్‌గా పనిచేశాడు. తాజాగా ఆయన బాబి దర్శకత్వంలో శరత్‌మరార్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంతో తన మల్టీ టాలెంట్‌ను మరలా బయటకు తీస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఓ పాట పాడుతున్నాడు. అలాగే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఆయనే ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. తాజా విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో ఆయన కొన్ని పాటలకు డ్యాన్స్‌ను కూడా కంపోజ్ చేస్తూ కొరియోగ్రాఫర్‌గా మారుతున్నాడట. మొత్తానికి ఈ చిత్రంలో కేవలం డైరెక్షన్ తప్పితే అన్ని విభాగాల్లోనూ పవన్ అన్నీ తానై వ్యవహరిస్తుండటం విశేషంగా చెప్పాలి. మరి పవన్‌లోని క్రియేటర్ తన అభిమానులను, ప్రేక్షకులను ఎలా అలరించనున్నాడో వేచిచూడాల్సివుంది..?