Advertisementt

సూపర్‌స్టార్ అల్లుడికి అవమానం!

Sat 19th Dec 2015 01:20 PM
super star rajinikanth,nava manmadhudu movie,rajinikanth son in law,dhanush,raghuvaran btech  సూపర్‌స్టార్ అల్లుడికి అవమానం!
సూపర్‌స్టార్ అల్లుడికి అవమానం!
Advertisement
Ads by CJ

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, ప్రముఖ తమిళ హీరో ధనుష్‌కు తెలుగులో అంతగా గుర్తింపు లేదు. ఆ మధ్య విడుదలైన ‘రఘువరన్ బీటెక్’తో తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరైన ఆయన తాజాగా తెలుగులో ‘నవ మన్మథుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. వాస్తవానికి ఈ చిత్రం నేడు (డిసెంబర్ 1) తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సి వుంది. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని దక్కించుకున్న నిర్మాతల అనుభవరాహిత్యం వల్ల చిత్రం నేడు విడుదల కాలేదు. తొలిసారిగా రెండు భాషల్లో విడుదలవుతున్న ధనుష్ సినిమా కావడం, దీనికి తోడు ‘రఘువరన్ బీటెక్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేల్‌రాజ్ ఈ చిత్రానికి కూడా దర్శకుడు కావడంతో చిత్రంపై పాజిటివ్ ఓపినియన్స్ వుండే అవకాశం వుంది. అయితే కేవలం తెలుగు హక్కులు దక్కించుకున్న నిర్మాతల నిర్లక్ష్యం.. ఏకపక్ష నిర్ణయాల ధోరణితో ఓ క్రేజీ సినిమాకు రావాల్సిన హైప్ రాకపోగా.. అతి తక్కువ థియేటర్లలో ఓ సీ గ్రేడ్ సినిమాలా.. ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించారు. అయినా కనీసం సినిమాకు ప్రచారం లేకుండా.. థియేటర్లు లేకుండా.. రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు అవమానం జరిగేలా నవ మన్మథుడు నిర్మాతలు వ్యవహరించడం పట్ల ధనుష్ అభిమానులు ఆగ్రహంతో వున్నారట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ