హిందీ హీరో అక్షయ్ కుమార్ గారికి దక్షినాది సినిమాలంటే వల్లమాలిన అభిమానం. ఇక్కడ హిట్టయిన ప్రతి తెలుగు, తమిళ, మలయాళ సినిమాని ఆయన మొదటి వారంలోనే చూసేస్తారు. కథ నచ్చేస్తే, హిందీలో తీసేయోచ్చని అనుకుంటే వెంటనే తన మనుషుల ద్వారా రీమేక్ రైట్స్ కొనేయడమో లేక వారితో కలిసి హిందీలో తీసేయడమో జరుగుతుంది. తమిళ్ సూపర్ హిట్ కత్తిని చూసినప్పటి నుండి అక్షయ్ కుమార్ దీన్ని హిందీ లో రీమేక్ చేయాలని ఆశపడ్డాడు. ఇందుకోసం నిర్మాతలైన లైకా సంస్థకి భారీ అమౌంట్ ముట్టజెప్పాలనుకున్నాడు. కానీ ఆయన ఆత్రానికి మరో బంపర్ అవకాశం కూడా తోడైంది. లైకా వారు హిందీ కత్తికి అక్షయ్ కుమార్ గారితో అగ్రిమెంట్ చేసుకుంటూనే రజినీకాంత్ రోబో 2.0లో విలన్ పాత్ర కూడా బోనసుగా ఇచ్చారు. ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే లైకా వారి తదుపరి రెండు ప్రాజెక్టులకు అక్షయ్ కీలకం కాబోతున్నాడు. వచ్చే ఏడాది అక్కీకి కత్తి, రోబో 2.0... రెండూ కత్తిలాంటి సినిమాలే.