మెగా ఫ్యామిలీకున్న బలమైన కంచు కోట నైజాం ఏరియా. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య వేసిన గట్టి పునాదుల మీద తమ్ముడు, మిగతా కుటుంబ హీరోలు తమ ఇమేజీని కట్టుకుంటున్నారు. ఇలా డొమెస్టిక్ మార్కెట్ ఒక్కటే దాని మీద ఆధారపడడం తప్ప ఇంటర్నేషనల్ స్థాయిలో, మరీ పాయింట్ అవుట్ చేయాలంటే అమెరికాలాంటి దేశాల్లో వీళ్ళు పెద్దగా బలపడింది లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా రామ్ చరణ్ కూడా ఇంతవరకు మిలియన్ డాలర్ క్లబ్బులో చేరలేదంటే వీరి గడ్డు స్థితి అర్థమవ్వాలి. ఇప్పుడు అన్నయ్య చరణ్ చూపిన దారిలోనే నేనూ అన్నట్లుగా వరుణ్ తేజ ప్రయాణం చేస్తున్నాడు. మొన్న రిలీజయిన లోఫర్ సినిమాకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫర్వాలేదు అనిపించే షేర్స్ వచ్చినప్పటికీ అమెరికాలో మాత్రం పరిస్థితి దారుణాతిదారుణంగా ఉందట. మొదటి రెండు రోజులు కలిపి కనీసం పదిహేను లక్షలు వసూళ్లు కూడా దాటలేదంటే లోఫర్ పని అయిపోయినట్టే. కంచెతో విదేశీ మార్కెట్టులో దొరికిన కొంత స్పేసును ఉపయోగించుకోవడంలో వరుణ్ పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే లోఫర్ కొనుక్కున్న బయ్యర్లకు ఓవర్సీసులో దెబ్బలు తప్పేలా లేవు!