Advertisementt

రానా నిజంగా ఛాన్స్ ఇచ్చాడా!

Mon 21st Dec 2015 12:51 PM
rana daggubati,annish krishna,ala ela movie,bahubali,ballala deva,rana new movie  రానా నిజంగా ఛాన్స్ ఇచ్చాడా!
రానా నిజంగా ఛాన్స్ ఇచ్చాడా!
Advertisement
Ads by CJ

తొలి సినిమాతోనే సత్తా చూపించిన దర్శకుడు అనీష్‌కృష్ణ. 'అలా ఎలా?' తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు ఈయన. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఇప్పుడీ దర్శకుడు తన రెండో సినిమాకి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. తన రెండో సినిమా కోసం హీరో రానాని ఒప్పించాడు ఈ దర్శకుడు. ఇటీవల ఓ డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో రానాను కలిసిన అనీష్‌... రానా సొంతబేనర్‌ సురేష్‌ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంపై త్వరలో అధికార ప్రకటన రానుంది. ఇప్పటి వరకు గెస్ట్‌రోల్స్‌, మల్టీస్టారర్స్‌తో పేరు తెచ్చుకున్న రానా తనకు సోలో హీరోగా హిట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన తండ్రి నిర్మాత సురేష్‌బాబు కూడా రానాను సోలోహీరోగా నిలబెట్టే అవకాశం వస్తే వదిలిపెట్టడం లేదు. సో... ఈ చిత్రంతో రానాను సోలోహీరోగా నిలబెట్టే ప్రయత్నం అనీష్‌కృష్ణ చేతిలో ఉందని చెప్పవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ