మొన్న రంగనాథ్, నిన్న భరత్... రెండు ఆత్మహత్యలతో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయింది. భార్య మరిణించిన ఆరు ఏళ్ళకు ఆమె జ్ఞ్యాపకాలతో కాలం వెళ్ళదీస్తున్న రంగనాథ్ గారు ఆమె దగ్గరకే మానసిక క్షోభకు గురయి ఉరి వేసుకుంటే, మరి ఆరేడు వారాల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఆట డ్యాన్స్ షో యువ కొరియోగ్రాఫర్ భరత్ అనుమానాస్పద రీతిలో ఉరి వేసుకుని మరణించాడు. రంగనాథ్ గారి విషయంలో అన్ని వాస్తవాలు మనకు తెలిసినవే అయినా భరత్ చావు వెనక మాత్రం అతడికి కాబోయే భార్యతో శారదతో విభేదాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే విజయవాడకు చెందిన శారదతో భరత్ వివాహ నిశ్చితార్థం జరిగింది. గత కొన్నాళ్ళుగా భరత్ పదేపదే శారదతో మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగా ఆమె మాత్రం దూరంగా ఉండడానికే ఇష్టపడుతోంది. మొన్న రాత్రి ఎన్ని సార్లు ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పాటు శారదకు తనతో పెళ్లి ఇష్టం లేదని తెలిసిన భరత్ మనస్తాపానికి గురయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.