స్టంట్స్ తీసేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించడం కోసం డూప్‌లను వినియోగిస్తుంటారు. అయితే బాలయ్య మాత్రం వీటికి మొదటి నుండి వ్యతిరేకి. ఎలాంటి రిస్కీ ఫైట్ అయినా, జంప్ అయినా మరొకటి అయినా తానే స్వంతంగా చేసేస్తుంటాడు. అయితే వయసు వచ్చింది కదా! అని ఇప్పుడు డూప్‌ను పెట్టబోతే ఆయన సున్నితంగా తిరస్కరించి డూప్‌లేకుండా ఫైట్స్ ఇరగదీశాడట. 55 ఏళ్ల వయసులో 'డిక్టేటర్' కోసం క్టైమాక్స్ ఫైట్‌ని హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్తంలో చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఎన్నో సాహసాలను బాలయ్య స్వయంగా చేశాడట. అవి చాలా పెద్ద రిస్క్ సీన్స్ అని తెలుస్తోంది. సుమారు 150మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ సీన్‌ని తీస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య సాహసాలే పెద్ద హైలైట్ అవుతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.