ట్రైలర్ టాక్: `నేను శైలజ`
ఒక హిట్టు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు రామ్. ఆ హిట్టు విశాఖపట్నం బీచ్‌లాగా ఆయనకి కళ్లముందు స్పష్టంగా కనిపిస్తోంది, కావల్సినంత గట్టిగా వినిపిస్తున్నట్టుంది. `నేను శైలజ`రూపంలో.
కొంతకాలంగా ఆయన రొటీన్ కథలు చేస్తూ వచ్చాడు రామ్. ఇప్పుడు వాటికి గుడ్ బాయ్ చెప్పేసి `నేను శైలజ`లాంటి ఓ క్యూట్ లవ్‌స్టోరీని ఎంచుకొని సినిమా చేశాడు. లవ్ ఫెయిల్యూర్స్‌కి సంబంధించిన కథ ఇది. అలాగని దేవదాసు టైపు విషాదాంత కథేమీ కాదు. హ్యూమరస్‌గా తీశారు. ట్రైలర్‌లోనే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. హృదయాన్ని తడుతూ టక్కున నవ్వించే డైలాగులతో రెండు నిమిషాల ట్రైలర్‌ని వదిలారు. అది సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
'స్నేహం విశాఖపట్నం బీచ్‌లాంటిది. కళ్లుముందు స్పష్టంగా కనిపిస్తుంది. కావల్సినంత గట్టిగా వినిపిస్తుంది
మరి లవ్వు... అదొక హుద్ హుద్ ప్రశాంతమైన జీవితాన్ని పాడు చేసి వెళ్లిపోతుంది',
'ఏంటి సార్.. గడ్డం పెంచారు?
లవ్ లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక.. జిమ్‌కెళ్లి సిక్స్ ప్యాక్ చేయమంటావా?'
'టెన్త్ నుంచీ డిగ్రీ వరకూ పరీక్షలన్నీ ఒకేసారి రాసినట్టుంది..
కానీ ధైర్యం ఏంటంటే.. ప్రతీ సబ్జెక్టూ లవ్వే'...
అంటూ ట్రైలర్‌లో డైలాగులు కట్టిపడేస్తున్నాయి. రామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించారు. జనవరి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.