పాపం.. ప్రియమణి... గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్‌లో ఆమె పేరే వినిపించడం లేదు. ఒకప్పుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి స్టార్స్ సరసన నటించిన ఆమె కొత్త హీరోయిన్ల తాకిడికి మాయమైపోయింది. దీంతో ప్రియమణి ఖేల్ ఖతం... దుకాణ్ బంద్... అనుకొన్న తరుణంలో ఆమెని ప్రకాష్‌రాజ్ ఆదుకొన్నాడు. ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో రూపొందనున్న 'మన ఊరి రామాయణం' అనే సినిమాను దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. మూడు భాషల్లోనూ ప్రియమణినే కథానాయికగా తీసుకొన్నాడట ప్రకాష్‌రాజ్. దాంతో మూడు చోట్ల ప్రియమణి మరలా తన సత్తా చూపించే అవకాశం దక్కిందన్నమాట..! ఈ అవకాశాన్ని ప్రియమణి ఎంతవరకు సద్వినియోగం చేసి నిలబెట్టుకొంటుందో వేచిచూడాలి...!