Advertisementt

ఇళయరాజా క్షమాపణ చెప్పాల్సిందేనట!

Fri 25th Dec 2015 04:59 PM
ilayaraja,beep song,anirudh,simbu,media,media fire on ilayaraja  ఇళయరాజా క్షమాపణ చెప్పాల్సిందేనట!
ఇళయరాజా క్షమాపణ చెప్పాల్సిందేనట!
Advertisement
Ads by CJ

తమిళనాడులో లేటెస్ట్‌ సంచలనం బీప్‌సాంగ్‌. ఈ సాంగ్‌ ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో అన్నిరకాలుగాను సమస్యలను తెచ్చిపెడుతోంది. రీసెంట్‌గా ఇళయరాజా సైతం ఇందులో ఇరుక్కున్నాడు. ఇటీవల వరదబాధితుల కోసం తన వంతుగా సహకరించిన వారిని సంగీత దర్శకుడు ఇళయరాజా అభినందించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ఇళయరాజా వెళ్తుండగా ఆయన్ను బీప్‌ సాంగ్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీంతో ఆయన చాలా సీరియస్‌ అయ్యారు. ఆ రిపోర్టన్‌ను ఆయన తూలనాడాడు. అంతేకాకుండా నన్ను ఆ ప్రశ్న అడగటానికి నీకేం అర్హత ఉంది? అని నిలదీశాడు. ఇళయరాజా మాటలతో పలువురు మీడియా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ జర్నలిస్ట్‌గా ఆయన అడిగిన ప్రశ్నలో తప్పేముంది? అంటూ మిగిలిన మీడియా వారు ఇళయరాజాపై కోపంతో ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని పాత్రికేయ సంఘాలు, ఇళయరాజాల మధ్య చిన్న పాటి సమస్య కొనసాగుతోంది. ఇళయరాజా ఆ రిపోర్టర్‌కు క్షమాపణ చెప్పాల్సిందే అని మీడియా వర్గాలు పట్టుబడుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ