Advertisementt

పెదరాయుడి వారసుడు ఎవరో తెలుసా?

Fri 25th Dec 2015 05:35 PM
son of pedarayadu,manchu manoj,pedarayudu sequel,shourya movie,manchu manoj movies  పెదరాయుడి వారసుడు ఎవరో తెలుసా?
పెదరాయుడి వారసుడు ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

దర్శకుడు దశరథ్‌ డైరెక్షన్‌లో మంచు మనోజ్‌ హీరోగా 'శౌర్య' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ బాగా ఉండటంతో మనోజ్‌ ఆనందానికి అవధులు లేవు. దీంతో ఆయన తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ 'సన్నాఫ్‌ పెదరాయుడు' అన్న సంగతి తెలిసిందే. రమేష్‌పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా నడుస్తుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ గురించి గత రెండు సంవత్సరాలుగా టాపిక్‌ నడుస్తోంది. ఇన్నాళ్లకు ఇది ఫైనల్‌ అయింది. మోహన్‌బాబు కెరీర్‌లోనే కలికితురాయి వంటి సినిమా 'పెదరాయుడు'. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. అంతేకాదు... డైలాగ్‌కింగ్‌ మోహన్‌బాబును ఓ రేంజిలో చూపించారు ఈ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్‌ 'సన్నాఫ్‌ పెదరాయుడు'కి కొత్త దర్శకుడు సాగర్‌ పసల దర్శకత్వం వహిస్తారని, ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలో ఎక్కువ భాగం జరుగనుంది సమాచారం. 'పెదరాయుడు' సాధించిన విజయంలో దాని దర్శకుడు రవిరాజా పినిశెట్టి పాత్ర చాలా కీలకం. మరి ఈ కొత్త దర్శకుడు తాజా చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తాడు? అనేది ఆసక్తికర అంశం. మొత్తానికి మంచు మనోజ్‌ తనకు 'శౌర్య', 'సన్నాఫ్‌ పెదరాయుడు'లలో ఒక్క చిత్రమైనా హిట్‌ కావాలని ఎంతో ఆశతో ఉన్నాడు. మరి సరైన హిట్టేలేని ఈ మంచు వారి అబ్బాయికి ఈ చిత్రాలైనా ఓ సూపర్ డూపర్ హిట్‌ను అందిస్తాయో లేదో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ