తెలుగులో చిన్న హీరోలతో చేయమని చందమామ కాజల్ అగర్వాల్‌ని అడిగితే నో చెబుతోంది. కానీ అదే సమయంలో ఆమె బాలీవుడ్‌లో మాత్రం చిన్న హీరోలతో నటించడమే కాదు.. అందాల ఆరబోతకు కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఆమె రణదీప్‌హుడా వంటి చిన్న హీరో సరసన 'దో లబ్జోంగీ కహాని' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె తన గ్లామర్ షోలో రెచ్చిపోయి నటించింది. ఇందులో ఆమె ఓ అంధురాలిగా నటిస్తోంది. రణదేవ్‌హుడాతో కలిసి ఏకంగా లిప్‌లాక్‌లు, ఫ్రెంచ్ కిస్‌లలో నటించింది. అంతే కాదు చిట్టిపొట్టి డ్రస్‌లతో పాటు స్విమ్ సూట్‌లో కూడా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. మరి తెలుగు నిర్మాతలకు సవాలక్ష కండీషన్స్ పెట్టే ఈ చందమామ.. బాలీవుడ్‌లో మాత్రం ఇలా నటిస్తుండటంతో ఆమెతో సినిమాలు చేసిన వారు, చేస్తున్నవారు కోపంతో ఉన్నారు.