Advertisementt

ప‌వ‌న్ గురించి మోహ‌న్‌బాబు ఇలా..!!

Sat 26th Dec 2015 02:52 PM
mohan babu,pawan kalyan,mama manchu alludu kanchu,face book,mohan babu about pawan kalyan,jr ntr,rajinikanth  ప‌వ‌న్ గురించి మోహ‌న్‌బాబు ఇలా..!!
ప‌వ‌న్ గురించి మోహ‌న్‌బాబు ఇలా..!!
Advertisement
Ads by CJ

న‌వ‌త‌రం క‌థానాయ‌కుల‌కు ఏమాత్రం తీసిపోన‌ని నిరూపిస్తున్నాడు మోహ‌న్‌బాబు. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఆధునిక ప‌ద్ధ‌తుల్ని అనుస‌రిస్తూ అద‌ర‌గొట్టేస్తున్నాడు. ఆయ‌న జెన‌రేష‌న్ క‌థానాయ‌కుల్లో ద‌క్షిణాదిలో ఎవ్వ‌రూ ఇలా చేయ‌డం లేదు. ట్విట్ట‌ర్ అంటేనే అదేంటి అని అడిగే సీనియ‌ర్ క‌థానాయ‌కులు చాలామందే క‌నిపిస్తారు. కానీ మోహ‌న్‌బాబు మాత్రం ఎప్ప‌ట్నుంచో ట్విట్ట‌ర్లో కొన‌సాగుతున్నాడు. అంతే కాదు.. అప్‌డేట్‌గా కూడా ఉంటున్నాడు. ర‌జ‌నీకాంత్‌లాంటి కథానాయ‌కులు కూడా ట్విట్ట‌ర్‌లో చేరారు కానీ... ఎప్పుడోకానీ వాళ్లు ట్వీట్లు చేయ‌రు. కానీ మోహ‌న్‌బాబు మాత్రం త‌ర‌చుగా త‌న మ‌న‌సులో ఉన్న‌ది బ‌య‌ట‌పెడుతుంటాడు. ఇటీవ‌ల మామ మంచు అల్లుడు కంచు సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ట్విట్ట‌ర్‌లో కొచ్చెన్ అండ్ ఆన్స‌ర్స్ సెష‌న్ నిర్వ‌హించాడు మోహ‌న్‌బాబు. అందులో ప‌లువురు అభిమానులు ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన కొచ్చెన్లు అడిగారు. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఏమ‌నుకుంటున్నారు? ఎన్టీఆర్‌పై అభిప్రాయ‌మేమిటి? ర‌జ‌నీకాంత్‌తో ఎలాంటి అనుబంధముంది?.... ఇలా ర‌క‌ర‌కాల కొచ్చెన్లు మోహ‌న్‌బాబుని అడిగారు. అన్నింటికీ త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పారాయ‌న‌. ప‌వ‌న్ గురించి అడిగిన‌ప్పుడు అత‌నొక మంచి మ‌నిషి అని స‌మాధానమిచ్చాడు మోహ‌న్‌బాబు. తార‌క్ గురించి చెప్ప‌మంటే వ‌న్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్ట‌ర్ అంటూ అభినందన‌ల్లో ముంచెత్తాడు. అలాగే ర‌జ‌నీకాంత్ గురించి చెబుతూ... త‌ను నాకున్న ఓ మంచి స్నేహితుడు అని స్ప‌ష్టం చేశాడు. ఈ జ‌న‌రేష‌న్‌లో న‌చ్చిన క‌థానాయ‌కులు ఎవ‌రంటే మాత్రం త‌న త‌న‌యులు మంచు మ‌నోజ్‌, విష్ణుల పేర్లు చెప్పుకొచ్చాడు. అలాగే ఇటీవ‌ల నేను చూసిన సినిమాల్లో శ్రీమంతుడు ఉత్త‌మ‌మైన‌ద‌ని చెప్పాడు. ద‌ర్శ‌క‌త్వం చేసే ఆలోచ‌న‌లు ఏమైనా ఉన్నాయా? అని అడిగితే ఆ త‌ప్పు మాత్రం ఎప్ప‌టికీ చేయ‌న‌ని  సెల‌విచ్చాడు. మొత్త‌మ్మీద నిన్న‌టిత‌రం క‌థానాయ‌కుడైనా స‌రే మోహ‌న్‌బాబు ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌కు చ‌క‌చ‌కా స‌మాధానాలు చెబుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ