సంక్రాంతి సంబరాలను మరింత అంగరంగ వైభవంగా, కోలాహలంగా మార్చేది తెలుగు సినిమా. అందుకే రానున్న సంక్రాంతికి బడా సినిమాలు కనీసం మూడు నాలుగైనా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికైతే బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనలు తమ తమ తారీఖులు పక్కా చేసేసుకుని పోటీలో దిగేందుకు కసరత్తులు మొదలు పెట్టాయి. ఇక జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతో విషయంలో ఇంకా ఓ క్లారిటీ దొరకడం లేదు. రేపు జరగబోయే ఆడియో వేడుకలో దీని మీద ఒక డెసిషన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. బాలయ్య, నాగార్జున, తారక్ లాంటి హేమాహేమీల మధ్యలో శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా కూడా రయ్ రయ్ అంటూ దూసుకొస్తానంటున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో UV క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ సినిమా పట్ల గట్టి నమ్మకమే ఉంది. బట్ ఎంతైనా, ఏ విధంగా కొలిచినా ఈ రాజాకు ఉండే ప్రాముఖ్యత పై వాటితో పోల్చుకుంటే తక్కువే. మా దగ్గర కంటెంట్ ఉంది, దాన్ని మాత్రమే నమ్ముకుని హిట్టు కొడతాం అంటే చేసేదేమీ లేదు.