Advertisementt

హెబ్బా..! అంత తీసుకుంటున్నావా?

Sun 27th Dec 2015 05:04 PM
heebah patel,kumari 21f,nannaku prematho,heebah patel remuneration,sankranthi,sukumar  హెబ్బా..!  అంత తీసుకుంటున్నావా?
హెబ్బా..! అంత తీసుకుంటున్నావా?
Advertisement
Ads by CJ

 ‘అలా ఎలా’ చిత్రంతో పరిచయమై..పెద్దగా లైమ్‌లైట్‌లోకి రాని కథానాయిక హెబ్బాపటేల్‌కు ‘కుమారి 21ఎఫ్’ మంచి పేరును తీసుకొచ్చింది. తన అభినయంతో..హావభావాలతో కుర్రకారుని కట్టిపడేసింది  ఈ ముంబయ్ సుందరి. బోల్డ్ సన్నివేశాల్లో ఎలాంటి బెరుకు లేకుండా నటించిన ఈ కుమారికి యువత ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు అందరిలాగే హెబ్బా కూడా తన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. తనకు వరుసగా వస్తున్న ఆఫర్లు చూసి ఉబ్బితబ్బిబవుతున్న ఈ భామ తన పారితోషికాన్ని ఏకంగా అరకోటికి పెంచేసిందట. అయితే మన నిర్మాతలు బేరమాడి ఓ ముప్పై ఐదుకు ఒప్పిస్తున్నారనుకోండి..అయితే హెబ్బా మాత్రం ఇది సంక్రాంతి వరకు వున్న ఆఫర్ మాత్రమే.. సంక్రాంతి తర్వాత నా పారితోషికం మరింత ఇవ్వాల్సి వస్తుంది అంటూ ముందుగానే చెప్పేస్తుందట. ఎందుకంటే తను ఎన్టీఆర్‌తో నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సంక్రాంతికి రానుంది కదా.. ఈ చిత్రంలో హెబ్బా.. ఎన్టీఆర్‌తో రెండో నాయికగా రోమాన్స్ చేసిందికదా.! అందుకే సంక్రాంతి ని టార్గెట్ చేసుకుని వుంటుంది కాబోలు...! అయితే హెబ్బా గడుసుతనాన్ని చూసి అబ్బా... హెబ్బా ఎంత గడుసుపిల్ల అంటున్నారు దర్శక నిర్మాతలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ