Advertisementt

సునీల్ ఎవరి అనుచరుడు?

Mon 28th Dec 2015 10:49 AM
sunil,anucharudu,mannara hcopra,akella vamsikrishna  సునీల్ ఎవరి అనుచరుడు?
సునీల్ ఎవరి అనుచరుడు?
Advertisement
Ads by CJ

సునీల్ హీరోగా ఇంకో రెండు వారాల్లో కృష్ణాష్టమి సినిమా థియేటర్స్ లోనికి దిగేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ చిత్రంతో పాటు ప్రస్తుతానికి సునీల్ ముందు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి RPA క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో, ప్రేమ కథా చిత్రం ఫేం నిర్మాత సుదర్శన్ రెడ్డి గారి నుండి వస్తున్న యాక్షన్ సినిమాకి ఇంకా నామకరణం చేయలేదు. ఫిలిం సర్కిల్స్ నుండి వస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి అనుచరుడు అనే టైటిల్‌ ఖరారు చేశారట. భారీ యాక్షన్ సీక్వెన్సులతో సునీల్ కెరీర్లోనే ఉన్నతమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్ మీద వస్తున్న ఈ  ప్రాజెక్టులో మన్నారా చోప్రా మెయిన్ హీరోయిన్. మొన్న విశాఖపట్నంలో జరిగిన పెద్ద షెడ్యూలుతో చిత్రీకరణ తుదిదశకు చేరుకుందట. కృష్ణాష్టమి హంగామా అయిపోయిన వెంటనే, సుమారుగా ఫిబ్రవరీ నెలాఖరుకల్లా అనుచరుడు హడావిడి మొదలయ్యే చాన్సు ఉంది. మరి అనుచరుడు అంటే ఫాలోవర్ అని అర్థం. కథాపరంగా సునీల్ ఎవరికి అనుచరుడు అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుందేమో!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ