Advertisementt

నందమూరి వారు డీ అంటే డీ!

Mon 28th Dec 2015 03:53 PM
balakrishna dictator,jr ntr nannaku prematho,pongal release  నందమూరి వారు డీ అంటే డీ!
నందమూరి వారు డీ అంటే డీ!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ డిక్టేటర్ సంక్రాంతి పోటీ నుండి తప్పుకుందన్న ఓ గాలివాటం వార్త టాలివుడ్ సర్కిల్స్ అంతటా వ్యాపించగానే అబ్బే అలాంటిదేమీ లేదు, మేం ఖచ్చితంగా రెడీ అనేలా సదరు దర్శకుడు, నిర్మాత శ్రీవాస్ నుండి వెంటనే ప్రత్యుత్తరం రానే వచ్చింది. అంటే బాలయ్య ఎప్పటిలాగే తనకిష్టమైన సంక్రాంతి బరిలో నిలవనున్నాడు అన్నది పక్కా కంఫర్మ్. ఇక మిగిలిన నందమూరి యువ కెరటం జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతో మీదే కొద్దో గొప్పో అనుమానాలు ఉండేవి. అందరూ అనుకున్నట్టుగానే నిన్న జరిగిన పాటల పండగతో ఆ అనుమానం కూడా పటాపంచలైంది. విపరీతమైన ఎమోషనల్ డ్రామా మీద వచ్చిన నాన్నకు ప్రేమతో థియేట్రికల్ ట్రైలర్లో చివరాఖరికి సంక్రాంతికి వస్తోంది అన్న లైన్ వేసి నందమూరి అభిమానుల్లో కలకలం రేపారు నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారు తన తండ్రి మరణించిన రెండో రోజు నుండే ఈ సినిమా రీ-రికార్డింగ్ పై కూర్చొని అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు కాబట్టి, ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి విలువనిచ్చి చిత్రాన్ని అనుకున్న తేదీకే విడుదల చేస్తున్నారు. నందమూరి హీరోల మధ్య పొంగల్ యుద్ధానికి నిన్నటితో అసలైన తెరలేసింది. ఇక రెండు చిత్రాలు డీ అంటే డీ అనేలా ముందుకు సాగనున్నాయి. ఏదైనా గొప్ప మ్యాజిక్కు జరిగితే తప్ప ఈ పోరాటం అనివార్యమే!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ