జై బాలయ్య, జై జై బాలయ్య అని కొత్తగా అరిచేది ఏముంది, ఎలాగో డిక్టేటర్ సంక్రాంతికే రిలీజవుతుంది కాబట్టి నందమూరి అభిమానులతో ధియేటర్లన్నీ నిండిపోయి జై బాలయ్య నిన్నాదాలతో హోరెత్తిపోతాయి. మళ్ళీ కొత్తగా దీని గూర్చి చెప్పుకోవాలా అంటే నిజంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే బాలయ్య అభిమానిగా నాని నటిస్తున్న జై బాలయ్య సినిమా ఫస్ట్ లుక్ 2016 న్యూ ఇయర్ మొదటి రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అన్నీ కుదిరితే డిక్టేటర్ సినిమాలో ఈ సినిమా మొదటి థియేట్రికల్ ట్రైలర్ కూడా ప్రదర్శించవచ్చు. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి టైటిల్ చెప్పగానే పిచ్చపిచ్చ హైప్ వచ్చేసింది. ఇక న్యూ ఇయర్ రోజున ఫస్ట్ లుక్ రిలీజ్ అనగానే బాలకృష్ణ అభిమానులు కూడా ఓసారి ఇటు లుక్కేసారు. భలే భలే మగాడివోయ్ అంటూ బంపర్ హిట్టు కొట్టిన నానికి ఈ జై బాలయ్య పట్ల కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే 2016 మొదటి రోజునే మనలను అలరించడానికి సిధ్ధమయిపోయాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఫిబ్రవరి రెండో వారంలో జై బాలయ్య ధియేటర్లలో దిగడం ఖాయం.