Advertisementt

కిస్సే కాని లిప్ కిస్సు కాదు!

Tue 29th Dec 2015 07:55 PM
abbayitho ammaayi,naga shaurya,palak lalwani  కిస్సే కాని లిప్ కిస్సు కాదు!
కిస్సే కాని లిప్ కిస్సు కాదు!
Advertisement
Ads by CJ

ఈ మధ్య వస్తున్న ప్రతి యూత్ ఫుల్ ఫిలింలోను హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ పేరిట కొంత శృతి మించిన శృంగారం సర్వ సాధారణం అయిపోయింది. చెప్పుకోవాలంటే లిప్ కిస్సులను లాలిపాప్ తిన్నంతా వీజీగా లాగించేస్తున్నారు. కుర్రకారు ప్రేక్షకులు కూడా ఇటువంటి స్టఫ్ పట్ల ఒకింత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే దర్శకనిర్మాతలు ఎందుకు ఊరుకుంటారు. జనవరి 1న విడుదల కాబోతున్న అబ్బాయితో అమ్మాయి చిత్రం ఫస్ట్ లుక్ నుండీ హీరో నాగ శౌర్య, హీరోయిన్ పాలక్ లాల్వానిలు మూతి ముద్దులు పెట్టుకుంటున్న పోస్టర్లే ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. పచ్చిగా చెప్పాలంటే మేకర్స్ కూడా మాంచి పబ్లిసిటీ అవుతుంది కదాని వాటి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. తీరా చూస్తే నాగ శౌర్య గుట్టుగా దాచుకున్న లోపలి విషయాన్ని బయటేసాడు. అసలు సినిమాలో లిప్ లాకులే లేవంట. జాదూగాడులో ఈయన గారు హీరోయిన్ సొనారికాను లిప్ కిస్ చేసినా సినిమా ఫలితం ఫెయిల్ అవడంతో ఇక అటువంటి కిస్సులకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. అసలు అబ్బాయితో అమ్మాయిలో అటువంటి కిస్ సీన్స్ లేనే లేవు. మీరు లిప్ కిస్సులు అనుకుంటున్న ఆ పోస్టర్లన్నీ మా దర్శకుడు రమేష్ వర్మ చేసిన మాయ అంటూ సెలవిచ్చాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ