పాత్ర డిమాండ్ చేస్తే ఎక్స్‌పోజింగ్ చేయడానికి నేను రెడీనే అని ముద్దుగుమ్మలు సిగ్గుపడుతూ చెబుతుంటారు. అయితే ఆ రోజులు పోయాయి. హీరోయిన్ అంటే అందంగా కనిపించాల్సిందే. అందుకే ఎక్స్‌పోజింగ్ చేస్తున్నాం. అందులో తప్పేంటి అని నేటి హీరోయిన్లు ఓపెన్‌గా మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. తాజాగా రాశిఖన్నా కూడా ఇదే మాట చెబుతోంది. హీరోలు ఫైటింగ్‌లు, డ్యాన్స్‌లు గట్రా చేయాలి. మేం గ్లామర్‌గా కనిపించాలి. అందుకే ఈ విషయంలో అభ్యంతరాలు ఎందుకు? అని అంటోంది. 'బెంగాల్‌టైగర్'లో బికినీలో కనిపించి సందడి చేసింది రాశిఖన్నా. తమన్నా కంటే తనే హాట్‌గా కనిపించింది. ఈ విషయం అడిగితే... తమన్నా బ్యూటీక్వీన్. తన పక్కన నేను కూడా కనిపించాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. అందుకే బికినీ వేశాను. అది పద్దతిగానే ఉంది. అసభ్యంగా లేదు కదా...! అంటోంది ఈ గడసరి...!