Advertisementt

ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది..!

Fri 01st Jan 2016 04:51 PM
ntr,nannaku prematho movie,janatha garage,koratala siva  ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది..!
ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'నాన్నకు ప్రేమతో' ఆడియో ఇటీవల గ్రాండ్‌గా రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విడుదలైన అఫీషియల్‌ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో రెస్పాన్స్‌ భారీగా వస్తోంది. ట్రైలర్‌ విడుదలైన కేవలం 36 గంటల్లోనే యూట్యూబ్‌లో ఒక మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 'బాహుబలి' సినిమాకు తప్ప ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ టాలీవుడ్‌లో ఏ సినిమాకు రాలేదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలకు ఓపెనింగ్స్‌ కీలకంగా మారిపోయాయి. ఏ సినిమా అయినా వారం రోజులలో బాక్సాఫీస్‌ వద్ద ఫలితం తేలిపోతోంది. సినిమాకు క్రేజ్‌ ఎక్కువగా ఉన్నప్పుడే ఓపెనింగ్స్‌ అదిరిపోతాయి. అందుకే ముందుగా సినిమా ట్రైలర్లు విడుదల చేసి వాటికి వచ్చే రెస్పాన్స్‌ ఆధారంగా ఓపెనింగ్స్‌ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఓ అంచనాకు వస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రంపై ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన విధంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌ఏ, ఇతర ఓవర్‌సీస్‌ మార్కెట్లలో వెయ్యికి పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కాగా ఈచిత్రం తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్క్రిప్ట్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చే పనిలో కొరటాల ఉన్నాడు. జనవరి చివరి వారంలో గానీ, లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగానీ ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రానికి 'జనతా గ్యారేజ్‌' అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌గా సమంతను, మరో హీరోయిన్‌గా నిత్యామీనన్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవలే నిత్యామీనన్‌ను కలిసి స్టోరీ వినిపించారని, కథ నచ్చడంతో పాటు ఎన్టీఆర్‌ సరసన నటించేందుకు నిత్యా ఎంతో ఆసక్తిని చూపించిందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ