Advertisementt

సర్ధుకుపోతున్న యువహీరోలు...!

Sat 02nd Jan 2016 11:38 AM
varun sandesh,rana,navadeep,prince,nenu sailaja  సర్ధుకుపోతున్న యువహీరోలు...!
సర్ధుకుపోతున్న యువహీరోలు...!
Advertisement
Ads by CJ

హీరోలుగా అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత పరిస్థితుల కారణంగా చిన్న చిన్న అవకాశాలకు కూడా యువహీరోలు సై అంటూ తమ మనుగడను చాటుకుంటున్నాను. కొన్నిహిట్‌ చిత్రాల్లో హీరోగా నటించిన 'ప్రిన్స్‌' తాజాగా 'నేను.. శైలజ' చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా కెరీర్‌ ప్రారంభంలో 'లీడర్‌, కృష్ణం వందే జగద్గురుం' చిత్రాలలో సోలో హీరోగా చేసిన దగ్గుబాటి రానా ప్రస్తుతం అతిథి పాత్రలకు, విలన్‌ పాత్రలకు పరిమితమవుతున్న సంగతి తెలిసిందే. ఇక 'హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం' చిత్రాలతో మంచి జోష్‌ మీద కనిపించిన వరుణ్‌సందేశ్‌ 'పాండవులు పాండవులు తుమ్మెద, మామ మంచు-అల్లుడు కంచు' చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు. ఇక నవదీప్‌ అయితే 'బాద్‌షా' చిత్రంలో విలన్‌గా మారిపోయాడు. త్వరలో మరో రెండు చిత్రాల్లో ఆయన విలన్‌ కమ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేయనున్నాడు. మొత్తానికి అందని ద్రాక్ష పుల్లన అనే సామెతను బాగా అర్థం చేసుకున్న ఈ యువహీరోలు భవిష్యత్తులో అయినా మరలా హీరోలుగా ఓ వెలుగు వెలుగుతారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ