కిల్లింగ్ వీరప్పన్ సినిమా సబ్జెక్టుగా సంచలనమే. ఇదే కథని తమిళ, కన్నడాల్లో వేరే దర్శకులు తీసి పారేసినా రామ్ గోపాల్ వర్మ పట్టుకున్నాడు కాబట్టి ఈ సంచలనానికి మరింత చలనం జతయింది. తెలుగు సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ రావడంలో జరిగిన జాప్యంతో నిన్న రిలీజ్ అవాల్సిన కిల్లింగ్ వీరప్పన్ తెలుగు వర్షన్ ఈనెల 7కి వాయిదా పడింది. కానీ ఇందులో జరిగిన మంచి ఏమిటంటే, వర్మ పేరేసి సినిమాకు రమ్మంటే ఎవరూ డబ్బులు బయటికి తీయరు. పైగా వీరప్పన్ కథ మనది కూడా కాదు. విడుదల వాయిదా పడడం ఎందుకు మంచిదయింది అంటే ఇప్పుడు ఇదే సినిమా కన్నడ వర్షన్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని వర్మా ఈజ్ బ్యాక్ అనే రేంజులో ఆడేస్తోంది. నిన్న రిలీజయిన ప్రతి కర్నాటక సెంటర్లో హౌస్ ఫుల్ వసూళ్లు నమోదయ్యాయి అని వినికిడి. ఇక అక్కడి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇక్క పడితే కిల్లింగ్ వీరప్పన్ 7వ తారీఖున మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం లేకపోలేదు. సినిమాకు కావాల్సిన బజ్ అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడు మొదలయింది.