Advertisementt

'డిక్టేటర్‌'పై అంచనాలు పెరుగుతున్నాయి..!

Sat 02nd Jan 2016 08:03 PM
dictator movie,balakrishna,sreevas,lion movie  'డిక్టేటర్‌'పై అంచనాలు పెరుగుతున్నాయి..!
'డిక్టేటర్‌'పై అంచనాలు పెరుగుతున్నాయి..!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం కావడం, అందునా ఈ చిత్రాన్ని ఈరోస్‌ సంస్థతో కలిసి దర్శకుడు శ్రీవాస్‌ స్వయంగా నిర్మిస్తుండటంతో ఇప్పుడు ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. 'లయన్‌' వంటి డిజాస్టర్‌ తర్వాత వస్తున్న చిత్రం అయినప్పటికీ ఈ చిత్రం బిజినెస్‌పై ఆ ప్రభావం పెద్దగా లేదని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. కాగా ఈ చిత్రం బడ్జెట్‌ 25కోట్లు అని సమాచారం. ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ను జెమినీ చానెల్‌ 6కోట్లపైగా భారీ మొత్తాన్ని ఇచ్చి సొంతం చేసుకుందిట. ఈ చిత్రాన్ని నైజాంలో దిల్‌రాజు పంపిణీ చేయడానికి సిద్దం అయి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు. ఇక ఆంధ్ర, సీడెడ్‌ ఏరియాల్లో కూడా ఈ చిత్రానికి థియేటికల్‌ రైట్స్‌ కోసం మంచి పోటీ ఏర్పడుతోంది. మొత్తంగా కలిపి ఈ చిత్రం విడుదలకు ముందే ఓ 10కోట్లు టేబుల్‌ ప్రాఫిట్‌ పొందడం ఖాయమని ట్రేడ్‌వర్గాల అంచనా. కాగా ఈ చిత్రానికి బాలీవుడ్‌ నుండి రీమేక్‌ రైట్స్‌ కోసం కొందరు నిర్మాతలు పోటీపడినప్పటికీ ఈరోస్‌ సంస్థ ఆ హక్కులను ఎవ్వరికీ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకొందని తెలుస్తోంది. సో.. మొత్తానికి బాలయ్య 99వ చిత్రం 'డిక్టేటర్'పై అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడి ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ