Advertisementt

ప్రభాస్ కి ఆ ఆలోచ‌నే లేదంట!

Sun 03rd Jan 2016 03:31 PM
prabhas,bahubali,prabhas marriage,bahubali 2,prabhas on marriage,prabhas other language movies  ప్రభాస్ కి ఆ ఆలోచ‌నే లేదంట!
ప్రభాస్ కి ఆ ఆలోచ‌నే లేదంట!
Advertisement
Ads by CJ

బాహుబ‌లి విడుద‌ల కావ‌డ‌మే ఆల‌స్యం... ఆ వెంట‌నే ప్ర‌భాస్ పెళ్లి పీట‌లెక్కుతాడని చెప్పుకొన్నారంతా. ప్ర‌భాస్ కూడా ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో ఆ విష‌యాన్ని చెప్పాడు. కానీ 'బాహుబ‌లి' వ‌చ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. ఇటీవ‌ల రెండో బాహుబ‌లి కూడా మొద‌లైంది. అయినా స‌రే ప్ర‌భాస్ మాత్రం ఇప్ప‌టిదాకా  పెళ్లి క‌బురు వినిపించ‌నే లేదు. అస‌లు దాని గురించి ఇంకా ఆలోచించ‌నే లేద‌ని,  కాబోయే భార్య‌లో ఎలాంటి క్వాలిటీలుండాలో  కూడా నాకు తెలియ‌ద‌ని, వాటి గురించి కూడా ఎప్పుడూ ఆలోచించ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. జ‌నాలు మాత్రం ఇదిగో ప్ర‌భాస్ చేసుకొనే అమ్మాయి, అదిగో ఆ ఊర‌మ్మాయిని ఫిక్స్ చేశారంట అని పుకార్లు మాట్లాడుకొంటున్నారు. చూస్తుంటే ప్ర‌భాస్ రెండో బాహుబ‌లి పూర్త‌య్యేవ‌ర‌కు పెళ్లి క‌బురు వినిపించేలా లేడు.

గ‌డిచిన 2015 మాత్రం త‌న‌కి జీవితాంతం గుర్తుండిపోతుంద‌ని ఇటీవ‌ల  ఓ ఇంట‌ర్వ్యూలో  చెప్పాడు ప్ర‌భాస్‌. బాహుబ‌లి సినిమా త‌న‌కి జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చింద‌ని, జాతీయ స్థాయిలో గుర్తింపొచ్చిన‌ప్ప‌టికీ తెలుగుకే నా మొద‌టి ప్రాధాన్య‌మన్నాడు ప్ర‌భాస్‌. బాహుబ‌లి 2 త‌ర్వాత తెలుగులోనే సినిమాలు చేయాల‌నుకొంటున్నాన‌ని, ఆలోపు ఇత‌ర భాష‌ల నుంచి ఏవైనా ఎక్సైటింగ్ ప్రాజెక్టులొస్తే మాత్రం వాటి గురించి ఆలోచిస్తాన‌ని చెప్పాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ