తెలుగు సినిమాలు కాదని తమిళనాడులో ముందు గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పిల్ల అంజలి గత కొన్నాళ్ళుగా ఇక్కడే టాలీవుడ్ అంతటా తచ్చాడుతోంది. ప్రస్తుతానికి బాలకృష్ణ గారితో డిక్టేటర్ విడుదల కోసం వేచి చూస్తోంది. కాకపోతే అమ్మడుకి మళ్ళీ తమిళ్ నుండి కొత్త పిలుపులు అందుతున్నాయి. ఇప్పుడిప్పుడే బాలయ్య లాంటి స్టార్ హీరోల సరసన అవకాశాలను దొరకపుచ్చుకుంటున్న తరుణంలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి సరసన అనేసరికి అంజలికి కూడా కాదనలేని పరిస్థితి. నిజం, మమ్ముట్టి చాన్నాళ్ళ తరువాత చేస్తున్న ఓ తమిళ సినిమా కోసం అంజలిని హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసారు. పెరనాబు అనే ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ కథాంశంతో రూపొందనుంది. అందుకే అంజలి కూడా వెంటనే ఒప్పేసుకుంది. వచ్చే రెండు మూడు వారాలలో తమిళనాడులోనే షూటింగ్ మొదలుకాబోతుంది గనక డిక్టేటర్ రిలీజయిన వెంటనే అంజలి మళ్ళీ అరవంలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. నటనకు ఆస్కారం ఉన్న మంచి రోల్స్ ఇక్కడకన్నా అక్కడే ఎక్కువ దొరుకుతాయని అంజలి విషయంలో కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు.