Advertisementt

ఇది నిజమేనా చిరంజీవి గారూ?

Mon 04th Jan 2016 05:11 PM
chiranjeevi,150th film,kaththi,151st film  ఇది నిజమేనా చిరంజీవి గారూ?
ఇది నిజమేనా చిరంజీవి గారూ?
Advertisement
Ads by CJ

చిరంజీవి గారు మళ్ళీ తెర మీద నటనతో వీర లెవెల్లో పర్ఫార్మ్ చేస్తుంటే కళ్ళారా చూడాలన్న ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే మెగాస్టార్ 150వ చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు యావత్ తెలుగు ప్రజలు. అలాగే చిరంజీవి గారు తమిళ కత్తిని తెలుగులో చేస్తున్నారని తెలిసిన తరువాత ఆనందం మరింత ఎక్కువైంది. ఇక పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులు చిరు గారి 151 లేదా 152వ చిత్రానికి దర్శకత్వం వహిస్తామని చెబుతుంటే మెగా అభిమానులు మళ్ళీ వాళ్ళ స్టార్ హీరో వరసపెట్టి సినిమాలు చేయబోతున్నాడని తెగ మురిసిపోయారు. మరి అవన్నీ తాత్కాలికమేనా అనేట్టుగా ఇప్పుడు చిరంజీవి గారి ఆఖరి చిత్రంగా కత్తి రాబోతుందన్న వార్తతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత నిజంగానే సినిమాలు చేసే ఆలోచన తక్కువై పోతుంది. కానీ మెగా స్టార్ మాత్రం కేవలం అభిమానులను మరోసారి ఉత్సాహపరిచేందుకే బ్రూస్ లీతో కంబ్యాక్ చేసి కత్తితో ఫుల్ జోష్ నింపనున్నారు. ఈ జోష్ ఇక్కడితో ఆగకూడదని, చిరంజీవి మరిన్ని చిత్రాలతో 150 కాదు 200 సంఖ్యను కూడా అందుకోవాలని మనందరం కోరుకుందాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ