Advertisementt

మెగాఫ్యామిలీ నుండి బన్నీ సెపరేట్ అయ్యాడా..?

Tue 05th Jan 2016 11:38 AM
allu arjun,megafamily,allu sireesh,allu fans club  మెగాఫ్యామిలీ నుండి బన్నీ సెపరేట్ అయ్యాడా..?
మెగాఫ్యామిలీ నుండి బన్నీ సెపరేట్ అయ్యాడా..?
Advertisement
Ads by CJ

మెగాకుటుంబం అంటే చిరంజీవి, రామ్‌చరణ్‌, పవన్‌కళ్యాణ్‌లతో పాటు బన్నీ కూడా...! బన్నీని కూడా మెగాఫ్యాన్స్‌ మెగాహీరోగా స్వీకరించి ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి తమ వంతు కృషి చేశారు. అయితే ఇప్పుడు ఈ కాంపౌండ్‌ నుంచి బన్నీ బయటకు వచ్చేశాడా? అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ఇటీవల అఖిల భారత అల్లు సంఘం పేరిట ఓ ఫ్యాన్స్‌ క్లబ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అల్లు హీరోలు బన్నీ, శిరీష్‌ల వేరుకుంపటికి ఇది నిదర్శనం అంటున్నారు. వాస్తవానికి అల్లుఅర్జున్‌కి ఎప్పుడో స్టార్‌ హోదా వచ్చేసింది. అభిమానుల క్రేజ్‌ పరిగణనలోకి తీసుకుంటే.. రామ్‌చరణ్‌ కంటే బన్నీకే ఫ్యాన్స్‌ ఎక్కువ మంది ఉన్నారనే టాక్‌ ఉంది. అందుకే తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమాన సంఘం ఉండాలని బన్నీ భావించాడని, అందుకే అఖిల భారత అల్లు సంఘానికి అంకురార్పణ జరిగిందని టాక్స్‌ వినిపిస్తున్నాయి. అంటే ఇక నుండి బన్నీ వేడుకలకు వీళ్లకే ఆహ్వానాలు అందుతాయన్న మాట. మరి ఈ వేరుకుంపటి మెగా-అల్లు ఫ్యాన్స్‌ మధ్య చిచ్చు రేపుతుందా? లేదంటే ఇది వరకటిలా కలిసిమెలిసి ఉంటారా? అనేది వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ