సంక్రాంతికి ఇదేమి పోటీ బాబోయ్ అని అటు నందమూరి అభిమానులు, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తుంటే పొంగల్ సందర్భంగా రానున్న నాలుగు సినిమాలకు కలిపి ఒకే వారం గ్యాపులో మరిన్ని చిత్రాలు రిలీజుకు సమాయత్తం అవుతున్నాయంటూ వార్తలు మొదలయ్యాయి. నిజానికి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా, ఎక్స్ ప్రెస్ రాజాలు వారానికి ఒకటి చొప్పున గనక వస్తే జనవరీ మొత్తం వీరికే సరిపోతుంది. కానీ పండగ పుణ్యమాని అన్నీ కట్టకట్టుకుని ఒకేసారి దిగిపోతున్నాయి. ఈ సినిమాలకు అపోజిషన్ లేకుండా కనీసం రెండు వారాలైనా ఖాళీ వ్యవధి ఇస్తే ఎవరికి దొరికినంత వారు దోచుకుని దుకాణ్ బంద్ చేసుకుంటారు. అది కాకుండా కళ్యాణ వైభోగమే జనవరి 22కి, లచ్చిందేవికి ఓ లెక్కుంది 29కి తీసుకొస్తున్నాం అని భయపెడితే దడుసుకోవడానికి అక్కడున్నవి అల్లాటప్పా సినిమాలు కావు. పైన పేర్కొన్న నాలుగింటిలో ఏదో ఒకటో లేక రెండో గనక వారం గట్టిగా కుమ్మితే మరో పదిహేను రోజుల దాకా ఎవరూ రిలీజ్ మాటెత్తరు. పైగా అన్నింటికీ థియేటర్ మాఫియా నుండి సపోర్ట్ పుష్కలంగా ఉందంట.