Advertisementt

బిగ్‌బిని నటించవద్దని కోరిన సూపర్‌స్టార్‌..!

Wed 06th Jan 2016 11:08 AM
rajinikanth,amitabh bachchan,robo2 movie,shankar  బిగ్‌బిని నటించవద్దని కోరిన సూపర్‌స్టార్‌..!
బిగ్‌బిని నటించవద్దని కోరిన సూపర్‌స్టార్‌..!
Advertisement
Ads by CJ

సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో 'రోబో2.0' చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో విలన్‌ పాత్రను చేయమని దర్శకుడు శంకర్‌ తనని సంప్రదించినట్లు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఈ పాత్రలో తనని నటించొద్దని రజనీకాంత్‌ తనను కోరాడని అమితాబ్‌ తెలిపాడు. అందుకే ఆ చిత్రంలో నటించే నిర్ణయాన్ని మానుకొన్నట్లు ఆయన అంటున్నాడు. శంకర్‌ తనను సంప్రదించగానే తాను రజనీకాంత్‌కి ఫోన్‌ చేశానని, ఆయన వెంటనే తనను విలన్‌గా యాక్సెప్ట్‌ చేయలేరని.. అందుకే వద్దని శంకర్‌కు చెప్పమని రజనీ బిగ్‌బికి సలహా ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్‌బచ్చనే తన తాజా చిత్రం 'వజీర్‌' చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో తెలిపాడు. మరి ఈ విషయం తెలిసిన శంకర్‌ ఏం ఫీలయి ఉంటాడో...! సాధారణంగా ఎవరైనా సరే బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ వంటి నటుడిని తమ సినిమాలో చేయమని రిక్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ విచిత్రంగా రజనీ ఇలా బిగ్‌బికి నటించవద్దని చెప్పడం ఏమిటి? అని కోలీవుడ్‌ మీడియా అంటోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ