డెడికేషన్, వృత్తి పట్ల నిబద్దత ఎన్టీఆర్‌కు చాలా ఎక్కువ అని అంటారు. అందుకేనేమో ఆయన హైఫీవర్‌తో బాధపడుతున్నా.. అనుకొన్న సమయానికి సినిమా పూర్తి చేసి, విడుదల చేయాలని రెస్ట్ తీసుకోకుండా బిజీ షెడ్యూల్‌లో ఉంటున్నాడు. ఎన్టీఆర్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎలాగైనా 13వ తేదీన విడుదల చేయాలని ఎన్టీఆర్ పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ హైఫీవర్‌లో కూడా పాల్గొని డబ్బింగ్ చెబుతున్నాడు. ఈచిత్రం అనుకున్న తేదీకి రావడం కోసం యూనిట్ మొత్తం ఎంతో కష్టపడుతోంది. మరో వైపు ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ తెలుగు లిప్ మూమెంట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో నేటి పరభాషా హీరోయిన్లు ఉన్నారు. కానీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న రకుల్‌ప్రీత్‌సింగ్ మాత్రం ఈ చిత్రానికి తానే స్వయంగా డబ్బింగ్ చెబుతోంది. ఆమె తన పాత్రకు డబ్బింగ్ చెప్పడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు.. ఆమె డబ్బింగ్ చెబుతోన్న ఓ ఫొటోను కూడా ట్వీట్ చేసింది.