Advertisementt

అలిగిన సూపర్‌స్టార్‌...!

Thu 07th Jan 2016 06:03 AM
mohanlal,janatha garage,koratala shiva,ntr  అలిగిన సూపర్‌స్టార్‌...!
అలిగిన సూపర్‌స్టార్‌...!
Advertisement
Ads by CJ

'నాన్నకు ప్రేమతో' తర్వాత ఎన్టీఆర్‌-కొరటాల శివల కాంబినేషన్‌లో 'జనతాగ్యారేజ్‌' అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుండి షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు పెదనాన్నగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం మోహన్‌లాల్‌ తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే... ఇటీవల ఫైనల్‌ నెరేషన్‌ విన్న మోహన్‌లాల్‌ తన పాత్ర పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నాడని టాక్‌. తన పాత్ర నిడివిని ఇంకొంచెం పెంచితే బాగుంటుందని ఆయన దర్శకుడు కొరటాల శివకు చెప్పాడట. మోహన్‌లాల్‌ మాట కాదనలేని కొరటాల శివ.. అందుకు ఒప్పుకొన్నాడని టాక్‌. సో.. ఈ సినిమాలోని మోహన్‌లాల్‌ పాత్ర కోసం ఇంకొన్ని సీన్లు యాడ్‌ చేయనున్నారని సమాచారం. ఆ సన్నివేశాల కోసం కొరటాల కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ