Advertisementt

మరో సౌత్‌ సినిమా ఆతి త్వరలో బాలీవుడ్ లోకి!

Fri 08th Jan 2016 01:41 PM
bollywood,karan johar,ok bangaram,babubali  మరో సౌత్‌ సినిమా ఆతి త్వరలో బాలీవుడ్ లోకి!
మరో సౌత్‌ సినిమా ఆతి త్వరలో బాలీవుడ్ లోకి!
Advertisement
Ads by CJ

'బాహుబలి' హిందీ వెర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించి, భారీగా సక్సెస్‌ అయిన నిర్మాత కరణ్‌జోహార్‌. ఇప్పుడు ఆయన దృష్టి మరో సౌత్‌ సినిమాపై పడింది. సౌత్‌ సినిమాలను హిందీలో బాగా ఆదరిస్తుండటం గమనించిన ఆయన మరో సౌత్‌ సినిమాని రీమేక్‌ చేసే పనిలో పడ్డాడు. ఆ సినిమా మరేదో కాదు... మణిరత్నం దర్శకత్వంలో మలయళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ కలిసి నటించిన 'ఓకే బంగారం'. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో నిర్మించేందుకు కరణ్‌జోహార్‌ సన్నాహాలు మొదలుపెట్టాడు. గతంలో మణిరత్నం వద్ద సహకార దర్శకుడిగా పనిచేసిన షాద్‌అలీ దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఈ మధ్యకాలంలో వరుస పరాజయాల పాలవుతున్న మణిరత్నంకు బ్రేక్‌ ఇచ్చిన సినిమా 'కాదల కన్మణి'. ముంబై వంటి సిటీల్లో యువత ఎలా ఉంటారో, అందుకు పెద్దల సహకారం ఎలా ఉంటాదో వివరిస్తూ తీసిన సినిమా ఇది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ