దర్శకుడు సుకుమార్ అన్న కొడుకు అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 'కంట్రోల్-సి' అనే టైటిల్‌తో తెరకెక్కిన సినిమాతో తన టాలెంట్‌ను చూపించబోతున్నాడు ఈ కుర్రహీరో. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అశోక్ నటించబోయే మరో సినిమా ఖరారైంది. బాబాయ్ సుకుమార్ అందించే కథతో రెండో సినిమాకు సిద్దం అవుతున్నాడు అశోక్. ఇటీవలే 'కుమారి21ఎఫ్'తో హిట్ కొట్టిన సుకుమార్ ఇప్పుడు తన పర్యవేక్షణలో 'దర్శకుడు' లేదా 'డైరెక్టర్' అనే టైటిల్‌తో మరో సినిమాను నిర్మించనున్నాడు. ఇప్పుడీ చిత్రంలో హీరోగా అశోక్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాకి కథతో పాటు స్క్రీన్‌ప్లేని కూడా సుకుమారే అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు.